కేశవరెడ్డి మృతికి అరసం సంతాపం

  స్మశానం దున్నేరు, మునెమ్మ, చివరి గుడిసె, రాముండాది రాజ్జెముండాది వంటి నవలల్లో దళిత జీవిత దుర్భరత్వాన్ని, పాఠకులను చైతన్యవంతం చేసేలా, ఆలోచనలు రేకెత్తించేలా రచనలు సాగించిన నిబద్ధ రచయిత కేశవరెడ్డి. దళితవాదం లేని రోజుల్లో దళిత హక్కుల కోసం ఉద్యమస్థాయిలో వినిపించిన బలమైన గొంతు కేశవరెడ్డి ! మనవజీవితపు చీకటి కోణాలను, సంక్లిష్టతలను తనదైన శైలిలో చిత్రించిన గొప్ప నవలా రచయిత డాక్టర్ కేశవరెడ్డి మృతికి అభ్యుదయ రచయితల సంఘం (అరసం) సంతాపం తెలుపుతోంది.   – […]

ఈ తరం కోసం “కథాస్రవంతి”

వందేళ్ళు పైబడిన తెలుగు కథా చరిత్రలో ఎందరో గొప్ప కథకులు తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. వేగవంతమైన నేటి ఆధునిక జీవితంలో, సాహిత్యాభిలాష ఉన్నా వేలసంఖ్యలో ఉన్న కథలలో ఏవి చదవాలి? ఎవరివి చదవాలి? మంచి కథలను ఎంచుకోవడం ఎలా? అన్న ప్రశ్నలు ఎదురవుతాయి. యువ రచయితలకు కూడా అధ్యయనం పెద్ద సమస్యగా మారింది! ఈ ప్రశ్నలకు సమాధానమే “ఈతరం కోసం ... కథాస్రవంతి’’ తెలుగు కథను సుసంపన్నం చేసిన మహా రచయితల రచనల నుండి 10 గొప్ప కధలను ఎంపిక చేసి, ఆయా రచయితల జీవితం, సాహిత్యంపై వివరణలతో, నేటి మంచి రచయితలే సంపాదకులుగా అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ సబ్సిడీ ధరతో అందిస్తున్న గొప్ప కథా సంకలనాలు మీ కోసం.... మల్టీ కలర్ లో, మంచి పేపర్ తో అత్యంత తక్కువ ధరలో ఈతరం కోసం కథా పరిమళాలు .. రచయితల పేర్లు చాగంటి సోమయాజులు అల్లం రాజయ్య కేతు విశ్వనాధ రెడ్డి పి.సత్యవతి పెద్దిభొట్ల సుబ్బరామయ్య కొలకలూరి ఇనాక్ కొడవటిగంటి కుటుంబరావు మధురాంతకం రాజారాం ఓల్గా మునిపల్లె రాజు అరసం అందిస్తున్న 10 మంది గొప్ప రచయితల 10 కథ సంకలనాల సెట్ సబ్సిడి ధర రూ.500/- AnandBooks.com ఈ సంకలనాల సెట్ ను ప్రీ పబ్లికేషన్ ఆఫర్ గా (Pre Publication Offer) మరింత తగ్గింపు ధరతో రూ. 400/- కే అందిస్తున్నది. ఈ అవకాశం డిసెంబరు 31 వరకు మాత్రమే!. నేడే మీ కాపీ బుక్ చేసుకోండి.! Click Here >> ముందుగా బుక్ చేసుకున్న పాఠకులకు జనవరి మొదటి వారంలో రిజిష్టర్ పోస్ట్ ద్వారా సెట్ ను పంపుతాము. ఈ కొత్త సంవత్సరాన్ని మంచి కథా పఠనంతో ప్రారంభిద్దాం .....రండి *****

కథానిక పాఠశాల (Workshop On Story)

ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ గుంటూరు నగరంలో డిసెంబర్‌ 26, 27, 28 తేదీలు శుక్ర, శని, ఆదివారాలలో కథానిక రచనపట్ల ఆసక్తి వున్న యువతీ, యువకుల్ని ఎంపికచేసి కథారచనలో శిక్షణ ఇవ్వడానికి పూనుకుంది. శిక్షణకు 20 – 35 సం||ల యువతీ, యువకులు అర్హులు. కథానిక రచనపట్ల ఆసక్తి వున్న యువతీ, యువకులు డిసెంబర్‌ 18లోగా తమ దరఖాస్తులను పంపాలి. బయోడేటాతోపాటు ఫోటో జతపరుస్తూ, గతంలో ఏవైనా రచనలు ప్రచురించబడినచో ఆయా […]

కొన్ని కొత్త పుస్తకాల పరిచయం

ఒక హిజ్రా ఆత్మకథ – Oka Hijra Atma Katha ఈ భూమి మీద 1,53,24,000 ట్రాన్స్‌ జెండర్‌ వాళ్ళున్నారని అంచనా. అంటే కజఖిస్థాన్‌, ఈక్వెడార్‌, కాంబోడియా దేశాల జనాభా అంత. ఈ సంఖ్యను చూస్తే మనలో ఒక కొత్త ఆలోచన నాంది కలుగుతుంది. ఈ పుస్తకానికి పాఠకులను పట్టి చదివించే శక్తి, వాళ్ళ ఆలోచనను ప్రేరేపించే శక్తి వున్నది. అట్లాగే విస్మయ భీతిని కూడా కలిగిస్తుంది. పుస్తకం అంతటా రేవతి తాను ఎదుర్కొన్న భయానక సంఘటన […]

ప్రపంచం మాయమైపోయింది

అదేంటో ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఆమధ్య ఒకసారి పొద్దునపూట చూడటం మొదలుపెట్టా, మధ్యాహ్నం అమ్మ భోజనానికి కేక వేస్తేగాని తెలివిరాలేదు . ఆకలి గుర్తురాదు. అప్పుడప్పుడు నిద్రపోవడం కూడా మర్చిపోతుంటాను. హాల్లో అందరూ కూచుని సంతోషంగా టివి చూస్తుంటే, నేను పొద్దుగూకులు పడకగదిలో ఏం చేస్తుంటానా అని మా అమ్మకి చాలా సార్లు అనుమానం వచ్చింది. “ఏం చేస్తున్నావురా” అడిగేది “రాస్కుంటున్నాను మా” చెప్పేవాడిని “ఏం రాస్తావో ఏంటో ! ఎప్పుడు చూసినా ఆ కిటికీలోంచి బయటికి చూడటమే తప్ప ఒక్క ముక్కైనా రాస్తావా అసలు?” చిరాకుపడేది. “ఒక రచయిత బయటకి తదేకంగా చూస్తున్నాడంటే, వాడు పనిచేస్కుంటున్నాడు అని అర్థం అమ్మా !” అర్థమయ్యేట్టు చెప్పాలనుకునేవాడిని. ‘రచయిత’ అనే పదం వినగానే అమ్మకి నవ్వొచ్చేది. పెద్దగా ఏమీ రాయకపోయినా నేనొక రచయితనని నేను ఈజీగా నమ్మేసాను. మా అమ్మ ఇంకా అది గుర్తించలేదు. ఒకవేళ గుర్తించినా నమ్మడానికి సిద్ధంగా లేదు. తన దృష్టిలో నేనొక ఇంజనీరింగ్ కుర్రాడిని మాత్రమే. ఒకసారి రచయిత అవుతానని చెప్పాను. అందరిలానే ఎదో ఒక బ్రాంచిలో ఇంజనీరింగ్ చేసేసి, చివరికి ఏ టిసియస్ లోనో ఇన్ఫోసిస్ లోనో ఉద్యోగం సంపాయించాలి. అక్కడితో వాళ్ళ జీవితాలకీ, నా జీవితానికీ ఒక పరిపూర్ణత/సార్థకత దొరుకుతుంది. ఆ తర్వాత నా ఇష్టమొచ్చింది అవ్వొచ్చని చెప్పింది. అదలా ఉంచితే, ఊరికి పెడగా, జనావాసాలకి దూరంగా, చుట్టూ ఖాళీ స్థలాల మధ్య ఉంటుంది మా ఇల్లు. ఇంత దూరంలో ఎందుకు కట్టిస్తున్నావు నాన్నా అని అడిగాను. “మన దగ్గర కోట్లు లేవు కదరా సెంటర్లో కట్టడానికి. ఇంకొన్ని రోజులు పొతే ఇక్కడ కూడా భూమి రేటు పెరిగిపోతుంది. అప్పుడు ఇంకా దూరం పోవాలి. అయినా ఎంతరా... ఇంకో రెండేళ్లలో ఇదంతా పెద్ద సెంటర్ అయిపొదూ?” అన్నాడు. ఇప్పటికి ఇది నాలుగో సంవత్సరం. మాకు చాలా మంది చుట్టాలున్నారు అని మా నాన్న ఎప్పుడూ చెప్తుంటాడు. చిన్నప్పుడెప్పుడో పెళ్ళిళ్ళకి, పండగలకీ కలుసుకున్న చుట్టాలు. ఇప్పుడు నాకు వాళ్ళ మొహాలు కూడా సరిగా గుర్తులేవు. నా టెన్త్ క్లాస్ మొదలు పెళ్ళిళ్ళకి అమ్మా నాన్నా మాత్రమే వెళ్ళొస్తున్నారు. నా గురించి చుట్టాలడిగితే చదువనో పరీక్షలనో చెప్పేవాళ్ళు. నాకు పెద్ద స్నెహితులెవ్వరూ లేరు. ఒక టి.వి., ముగ్గురు మనుషులూ ఉండే మా ఇంట్లో నాలుగో సజీవమైన మనిషిని ఎప్పుడైనా నేను చూడగలిగాను అంటే నా కిటికి లోంచే ! పడకగదిలో మంచానికి ఒక మూల కూచుంటే కిటికీ లోంచి మా ఇంటి వెనక 20 అడుగుల దూరంలో ఉన్న పెద్ద

డిసెంబర్ నెల విశేషాలు

సాహిత్యాభిమానులకు ఆన్‌లైన్‌ అభ్యుదయ అంతర్జాల పత్రిక సాహిత్యాభిమానులకు అరసం అభ్యుదయ అంతర్జాల పత్రికను ఆన్‌లైన్‌లో ఉంచామని అభ్యుదయ సంపాదకవర్గ సభ్యులు కె.శరత్‌ అన్నారు. స్ధానిక లాడ్జి సెంటరులోని ఎ.ఎల్‌.బి.ఇడి. కాలేజీ ఆవరణలో శుక్రవారం రాత్రి ఆన్‌లైన్‌లో అభ్యుదయ అంతర్జాల పత్రికను ఆవిష్కరించారు. ఈ ఆన్‌లైన్‌ పుస్తకానికి అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణకు అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్‌ అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్యఅతిధిగా కె.శరత్‌ పాల్గొని మాట్లాడుతూ […]

పెద్దిభొట్ల సుబ్బరామయ్య

”గురజాడ, శ్రీ పాద, కొ.కు., గోపీచంద్‌, చాసో వంటి కథకుల కోవకు చెందిన పెద్దిభొట్ల జీవిత వాస్తవికతను-వాస్తవిక, అభ్యుదయ దృక్పథంతో విమర్శనాత్మకంగా విశ్లేషించి శిల్పాత్మకంగా రూపు కట్టించే సంప్రదాయానికి వారసుడు” మానవ జీవితంలోని విషాద దృశ్యాలను నాలుగున్నర దశాబ్దాలుగా కథలుగా, నవలలుగా చిత్రీకరిస్తున్న పెద్దిభొట్ల సుబ్బరామయ్య 1938 డిసెంబర్‌ 15వ తేదీన గుంటూరులో జన్మించారు. ఎం.ఏ వరకు చదివిన వీరు విజయవాడ ఆంధ్ర లయోల కళాశాల ఆంధ్రశాఖలో 1957 నుంచి నలభై ఏళ్ళపాటు అధ్యాపకునిగా పనిచేస్తూ ఆ […]

ఆగని ప్రయాణం

అగ్నిజడిలో తడిసిన అలజడి జీవితం ఓ నిరంతర అంగారప్రవాహం చెదిరిన ఆకృతులను హత్తుకున్న అద్దం అదివరకంత ఆకర్షణగా అనిపించదు సుదూరాల గహన గమ్యాల మార్గం ఎన్నడూ తిన్నంగా కనిపించదు క్లిష్టాతిక్లిష్ట సంక్లిష్ట సంఘర్షణల ప్రయాణం ఒకడుగు ముందుకు – కొన్ని అడుగులు వెనక్కి?! విశ్రమించే తావు కానేకాదు, వేళ అసలేకాదు; ఈ పయనం ఆగేదీకాదు ఇష్టానిష్టాల పరిమితులకు లోబడని యానం అయినా….. … ఆగని ప్రయాణం కాలాన్ని కడుపులో నింపుకున్న కలం పురోగమనమే దాని తత్వం చిమ్మచీకట్లను, […]

సంసారి

  కోసక్కు గ్రామం పొలిమేరల నుంచి ప్రారంభమవుతుంది మహారణ్యం. దట్టమైన చెట్లతో ఆ ప్రాంతమంతా చీకటిగా ఉంటుంది. పగటికీ, రాత్రికీ తేడా ఉండదు. ఒక సాయంత్రం డాన్‌ నది దాటటానికి సరంగు కోసం వెదికాను. ఆ రోజెందుకో పడవలెక్కువ లేవు. వర్షం కురిసి, నేలంతా చిత్తడిగా ఉంది. ఆకులు, చిన్న జంతువుల కళేబరాలు, కుళ్ళిన దుర్గంధం అతటా వ్యాపించింది. బురదలో కాలు తీసి కాలు వెయ్యటం కష్టంగా ఉంది. ఊరి చివరన, స్మశానంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. మరి […]

పెనుగొండకు మారుపేరు బహువచనం

. గతకాలపు చీకటి నీడల్లోంచి, వర్తమాన సంక్షోభంలోంచి, రేపటిలోకి ప్రయాణిస్తున్న అవిశ్రాంత పథికుడు పెనుగొండ లక్ష్మీనారాయణ. అరవై ఏళ్ళనాడు మొదలైన ఈ జీవన యానం ఎన్నో దిగుళ్ళను, ఎగుడు దిగుళ్ళను అధిగమించింది. ఏ మజిలీలోను ఆగని నడక అతనిది. వ్యధావశిష్టమై ఆరని ఉత్సాహం అతనిది. పెనుగొండకు మరో పేరు జీవనోత్సాహం. అతనెప్పుడూ దు:ఖాన్ని ప్రేమించలేదు. ధైర్యాన్ని ప్రేమించాడు. ఆరాటాల బాట పట్టలేదు. పోరాటాల పాట అందుకున్నాడు. కావ్యకర్తగా కన్న కార్యకర్తగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతాడతను. సాహిత్య తైలంతో […]