ఆగని ప్రయాణం

Photo Courtesy-Shyamal Chakrovorty

Photo Courtesy-Shyamal Chakrovorty

అగ్నిజడిలో తడిసిన అలజడి

జీవితం

ఓ నిరంతర అంగారప్రవాహం

చెదిరిన ఆకృతులను హత్తుకున్న

అద్దం

అదివరకంత ఆకర్షణగా అనిపించదు

సుదూరాల గహన గమ్యాల

మార్గం

ఎన్నడూ తిన్నంగా కనిపించదు

క్లిష్టాతిక్లిష్ట సంక్లిష్ట సంఘర్షణల

ప్రయాణం

ఒకడుగు ముందుకు – కొన్ని అడుగులు వెనక్కి?!

విశ్రమించే తావు కానేకాదు, వేళ

అసలేకాదు;

ఈ పయనం ఆగేదీకాదు

ఇష్టానిష్టాల పరిమితులకు లోబడని

యానం

అయినా….. … ఆగని ప్రయాణం

కాలాన్ని కడుపులో నింపుకున్న

కలం

పురోగమనమే దాని తత్వం

చిమ్మచీకట్లను, మంచుతెరలను చీల్చుకుంటూ

విచ్చుకుంటున్న

వెలుగు రేఖలు చూడు… చూడు!

నిత్యసత్యం… ఎంత

అందంగా

ఉదయిస్తోంది!

– కె.శరచ్చంద్ర జ్యోతిశ్రీ

మంచి విషయం నలుగురికీ చెప్పండి !
Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someonePrint this page

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)