కథానిక పాఠశాల (Workshop On Story)


Kathanika Workshop on Story Writing

ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ గుంటూరు నగరంలో డిసెంబర్‌ 26, 27, 28 తేదీలు శుక్ర, శని, ఆదివారాలలో కథానిక రచనపట్ల ఆసక్తి వున్న యువతీ, యువకుల్ని ఎంపికచేసి కథారచనలో శిక్షణ ఇవ్వడానికి పూనుకుంది.

శిక్షణకు 20 – 35 సం||ల యువతీ, యువకులు అర్హులు. కథానిక రచనపట్ల ఆసక్తి వున్న యువతీ, యువకులు డిసెంబర్‌ 18లోగా తమ దరఖాస్తులను పంపాలి. బయోడేటాతోపాటు ఫోటో జతపరుస్తూ, గతంలో ఏవైనా రచనలు ప్రచురించబడినచో ఆయా రచనల ఫోటోస్టాట్‌ కాపీలను జత చేయాలి. దరఖాస్తుతోపాటు చిరునామా, ఫోన్‌, ఈ-మెయిల్‌ ఐ.డి. తెలియపరచాలి. వచ్చిన దరఖాస్తులలో 30 – 35 మంది విద్యార్ధులను ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

అరసం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తారు. సింగమనేని నారాయణ, డా|| మధురాంతకం నరేంద్ర, డా|| పాపినేని శివశంకర్‌, పెనుగొండ లక్ష్మీనారాయణ మొ||వారు ఉపాధ్యాయులుగా పాఠాలు బోధిస్తారు.

పాఠశాలలో కథానిక వస్తువు, శైలి, శిల్పం, కథనం, విమర్శ మొదలగు అంశాలమీద ఉపాధ్యాయులు తగిన శిక్షణనిస్తారు.

ఎంపిక కాబడిన విద్యార్ధులకు 2014 డిసెంబర్‌ 20లోగా వ్యక్తిగతంగా తెలియజేయబడుతుంది. ముందస్తుగా ఎంపిక కాబడిన వారు మాత్రమే ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనడానికి అర్హులు. వారికి వసతి భోజన సదుపాయాలు కల్పిస్తారు. Registration Fee రూ.100/- గుంటూరులో వర్క్ షాపు దగ్గరే చెల్లించవలసి ఉంటుంది. దరఖాస్తులు పోస్టు ద్వారా పంపేవారు దిగువ చిరునామాకు, ఈ మెయిల్‌ ద్వారా పంపేవారు editor@abhyudayaonline.com కు పంపాలి.

 

కథానిక పాఠశాల – పాఠ్య ప్రణాళిక

 1. ఆధునిక తెలుగు సాహిత్యం పుట్టుక – నేపథ్యం
 2. ఆధునిక తెలుగు సాహిత్యం – కథానిక ప్రక్రియ
 3. తెలుగు కథానిక – శిల్ప ప్రాధాన్యం
 4. తెలుగు కథానిక వికాసం (సామాజిక ఉద్యమంలో కథానిక)
 5. కథానిక – అనుబంధ ప్రక్రియలు (స్కెచ్‌ – గల్పిక – మినీ కథ – పేజీ కథ – కార్డు కథ)
 6. తెలుగు కథానిక – పాశ్చాత్య ప్రభావం
 7. తెలుగు కథానిక – రూపం – వస్తువు
 8. కథానిక రచన – మెలకువలు
 9. కథకులతో ఇష్టాగోష్టి
చిరునామా

వల్లూరు శివప్రసాద్‌,

సెల్‌ – 9291530714

డోర్‌ నెంబరు :4-13-7/2 ఫస్ట్‌ ఫ్లోర్‌,

నాయుడు పేట 1వ లైను,

అమరావతి రోడ్డు,  గుంటూరు – 522007

 

Technical Support by AnandBooks.com

 

మంచి విషయం నలుగురికీ చెప్పండి !
Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someonePrint this page

Comments

 1. By INDU RAMANA

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)