కొన్ని కొత్త పుస్తకాల పరిచయం

ఒక హిజ్రా ఆత్మకథ – Oka Hijra Atma Katha

Oka Hijra Atma Katha Telugu Book

ఈ భూమి మీద 1,53,24,000 ట్రాన్స్‌ జెండర్‌ వాళ్ళున్నారని అంచనా. అంటే కజఖిస్థాన్‌, ఈక్వెడార్‌, కాంబోడియా దేశాల జనాభా అంత. ఈ సంఖ్యను చూస్తే మనలో ఒక కొత్త ఆలోచన నాంది కలుగుతుంది.

ఈ పుస్తకానికి పాఠకులను పట్టి చదివించే శక్తి, వాళ్ళ ఆలోచనను ప్రేరేపించే శక్తి వున్నది. అట్లాగే విస్మయ భీతిని కూడా కలిగిస్తుంది. పుస్తకం అంతటా రేవతి తాను ఎదుర్కొన్న భయానక సంఘటన గురించి చెబుతుంది. కానీ ఎవరి సానుభూతిని కోరదు. ఆమె అడిగేదొక్కటే. హిజ్రాలను అందరి మానవుల వలె కోరికలూ ఆశలూ వున్న తోటి మనుషులుగా చూడమని. ఒక హిజ్రాగా తన వ్యక్తిగత విషయాలను నిర్భయంగా నిస్సంకోచంగా చెప్పిన తీరు అభినందనీయమేకాక హృదయానికి హత్తుకునే విధంగా కూడా వుంది. తన లింగ మార్పిడి శస్త్ర చికిత్స గురించైనా, పోలీసులు పెట్టిన హింస గురించైనా, తన క్లయింట్స్‌ గురించైనా! జెండర్‌ గురించీ, పురుషాధిక్యత గురించీ ఆమె చేసిన విమర్శలు, వ్యాఖ్యలు చాలా స్పష్టంగా శక్తివంతంగా వుండి స్త్రీ పురుషులతో పాటు మూడవ లింగాన్ని కూడా మనం మానవీయంగా అర్థం చేసుకునే విధంగా కృషి చేయ్యాలనే అవగాహనను కలిగిస్తుంది.

– యోగిందర్‌ సికండ్‌

ఒక హిజ్రా ఆత్మకథ

రచయిత: రేవతి

ప్రచురణ: హైదరాబాద్ బుక్ ట్రస్ట్

వెల: రూ 130/-

ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

ఆన్‌లైన్ ప్రతులకు: www.AnandBooks.com

*****

అద్దం (భారత ఆర్ధికరంగం – దిశా దశా) – Addam (Bharata Arthikarangam – Disa Dasa)

Latest Telugu Book Addamఈ పుస్తకంలోని వ్యాసాలు చదువుతూంటే అర్ధశాస్త్రాన్నే చదువుతున్న అనుభూతి కలుగుతోంది. దీనిలో ప్రతి వ్యాసం ఒక విజ్ఞాన ఖండిక. ఆర్ధిక విషయాల్ని విడమర్చి, అర్ధమయ్యే రీతిలో చెప్పడం అంత సులభం కాదు. రాజకీయ శాస్త్రజ్ఞుడయినప్పటికీ, అర్ధశాస్త్రాన్ని కఠోరదీక్షతో అధ్యయనం చేసి, ఔపోసనంపట్టి, ఒడబోసి, ఆ విజ్ఞాన సర్వస్వాన్ని, సారాంశాన్ని సామాన్య మనిషికి కూడా అవగాహన కల్పించడంలో పాపారావు కృషి ప్రశంసనీయం. ఆర్ధిక రంగం అనేక ఇతర రంగాల్ని శాసిస్తుందని మనకు తెలుసు. దీని ప్రభావం అన్ని వర్గాల ప్రజలపైన వుంటోంది. ఆర్ధిక విషయాలు సామాన్యుడి నిత్యజీవితంలో ఎలాంటి ప్రభావం కలిగిస్తాయో రచయిత ప్రతి వ్యాసంలోనూ వివరించారు. ఆర్ధిక అంశాలు దేశీయ రంగానికే కాదు, అంతర్జాతీయ స్ధాయికి కూడా సంబంధించినవి కావొచ్చు. ప్రజల జీవతాలను మెరుగుపరచేదే ఆర్ధిక అభివృద్ధి. పెట్టుబడిదారీ వర్గాల, ప్రైవేట్‌ కార్పోరేట్‌ కంపెనీల లాభార్జనాలకు, సంపద పోగేసుకోవడానికి కల్పించే అవకాశం ఆర్ధిక అభివృద్ధి కాదనేనది పాపారావు గారి దృఢ అభిప్రాయం. ఈ పుస్తకం ద్వారా తెలుగు సమాజానికి ఒక విస్పష్టమైన సందేశాన్ని అందించడానికి వారు కృషి చేశారు. ఇప్పటికే వారు పుంఖాను పుంఖంగా రచనలు చేసిన మేధావిగా ప్రఖ్యాతి పొందారు. తెలుగు పాఠకులకు వారు కొత్త కాదు, సుపరిచితులే.

ఈ పుస్తకంలో ప్రతి పేజీలోనూ రచయిత యొక్క విస్తృతమైన, లోతైన అధ్యయనం కనబడుతోంది. అనేక మంది ప్రఖ్యాత సిద్ధాంతకర్తలు, మేధావులు, ఆర్ధికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాధినేతల సిద్ధాంతాలను, భావాలను, ఆలోచనల్ని, వ్యాఖ్యల్ని, అభిప్రాయాల్ని సందర్భోచితంగా ఉటంకిస్తూ రచయిత చేసిన విశ్లేషణ ఆశ్చర్యకరం, శ్లాఘనీయం. పాపారావు నిజమైన ప్రజాస్వామికవాది, అభ్యుదయవాది, ప్రఖ్యాత పత్రికా రచయిత అయిన ఈయన కలం నుంచి జాలువారిన ఈ పుస్తకంలోని వ్యాసాలు ఎంతో విజ్ఞానదాయకమైనవి.

– ప్రొఫెసర్‌ కె.ఆర్‌.చౌదరి

అద్దం (భారత ఆర్ధికరంగం – దిశా దశా)

రచయిత: డి. పాపారావు

ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్

వెల: రూ 80/-

ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

ఆన్‌లైన్ ప్రతులకు: www.AnandBooks.com

*****

తెలుగు తల్లి (ప్రసిద్ధ గేయ సంకలనం) – Telugu Thalli (Prasiddha Geya Sankalanam)

Telugu Talli Popular Telugu Songs Book

తెలుగు జాతి యొక్క ప్రాచీన వైభవం గురించి తెలుగు భాష, సంస్కృతి గురించి పిల్లలకు అవగాహన, చైతన్యం కలిగించటం కోసం శ్రీకృష్ణదేవరాయలు, శంకరంబాడి సుందరాచారి, రాయప్రోలు సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ, త్రిపురనేని రామస్వామి చౌదరి, జాషువా, దేవులపల్లి, శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, దాశరథి, కాళోజి, సి.నారాయణరెడ్డి, బాలాంత్రపు రజనీ కాంతారావు, వేములపల్లి శ్రీకృష్ణ మొదలగు కవుల పద్యాలు, గేయాలు ఈ పుస్తకంలో పరిచయం చేశాం. ఆయా కవుల గురించి కూడా పిల్లలకు ఒక అవగాహన కల్పించటం మా ఉద్దేశం. తెలుగు భాషకు దూరమవుతున్న ఈ నాటి పిల్లలు ఈ గేయాలు చదువుకొని తప్పకుండా గొప్ప స్ఫూర్తి పొందగలరని ఆశిద్ధాం.

తెలుగు తల్లి (ప్రసిద్ధ గేయ సంకలనం)

రచయిత: డా||పాపినేని శివశంకర్

ప్రచురణ: అమరావతి పబ్లికేషన్స్

వెల: రూ 60/-

ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

ఆన్‌లైన్ ప్రతులకు: www.AnandBooks.com

 

మంచి విషయం నలుగురికీ చెప్పండి !
Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someonePrint this page

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)