డిసెంబర్ నెల విశేషాలు

సాహిత్యాభిమానులకు ఆన్‌లైన్‌ అభ్యుదయ అంతర్జాల పత్రిక

abhyudaya avishakarana

సాహిత్యాభిమానులకు అరసం అభ్యుదయ అంతర్జాల పత్రికను ఆన్‌లైన్‌లో ఉంచామని అభ్యుదయ సంపాదకవర్గ సభ్యులు కె.శరత్‌ అన్నారు. స్ధానిక లాడ్జి సెంటరులోని ఎ.ఎల్‌.బి.ఇడి. కాలేజీ ఆవరణలో శుక్రవారం రాత్రి ఆన్‌లైన్‌లో అభ్యుదయ అంతర్జాల పత్రికను ఆవిష్కరించారు. ఈ ఆన్‌లైన్‌ పుస్తకానికి అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణకు అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్‌ అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్యఅతిధిగా కె.శరత్‌ పాల్గొని మాట్లాడుతూ సాహిత్యవేత్తలకు అందుబాటులో ఉండాలని, అభ్యుదయ ఆన్‌లైన్‌లో ఉంచామన్నారు. అభ్యుదయ మాసపత్రిక 1946 నుంచి అనేక సంవత్సరాల అక్షర మాధ్యమంలో సాహిత్యోద్యమ కరదీప్తిగా అరసం వెలువరించింది. అభ్యుదయ పత్రిక సంపాదకులు, సంపాదిత వర్గ సభ్యులు చదలవాడ పిచ్చయ్య, మల్లంపల్లి సోమశేఖర శర్మ, పడమటి గంటి, శ్రీ.శ్రీ, తుమ్మల, కె.వి.రమణారెడ్డి వ్యవహరించారన్నారు. ఈ పత్రిక నిర్బంధాలు, నిషేధాలతో ఆగిపోయిన అనేక సార్లు అరసం ప్రచురించిందన్నారు. సాహిత్య వేత్తలకు అందుబాటులో ఉండాలనే ఆన్‌లైన్‌లో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ సంపాదక వర్గ సభ్యులు ఎ.ఎం.ఆర్‌.ఆనంద్‌, ఎ.వినోద్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పొడుపు కథలు సామెతలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తకావిష్కర్తగా కన్నా మాస్టారు, సంపాదకులు పొత్తూరి వెంకట మురళీకృష్ణారావు, సభకు అధ్యక్షులుగా శేకూరి పాఠశాల ఉపాధ్యాయులు బి.ధర్మారెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ పురాతన కాలం నుంచి సామెతలు, పొడుపు కధలు ఉన్నాయన్నారు. పిల్లలకు చిన్న వయస్సులో తల్లిదండ్రులు సామెతలు, పొడుపు కథలు చెప్పి వాటిలోని నీతులను వివరించే వారని, దీని వలన పిల్లలకు మంచి చెడులపై అవగాహన ఏర్పడుతుందని అన్నారు.

‘థూ…’ పుస్తకావిష్కరణ

సమాజంలో అందరూ సమానమే

thoo avishkarana

సమాజంలో అందరూ సమానమే అని కవి, రచయిత, పత్రిక సంపాదకులు, సాహితీవేత్త సతీష్‌ చందర్‌ అన్నారు. స్ధానిక లాడ్జిసెంటరులోని ఎ.ఎల్‌. బి.ఇడి. కళాశాల ఆవరణలో విశాలాంధ్ర బుక్‌ హౌస్‌, అరసంల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 16వ గుంటూరు పుస్తక మ¬త్సవ కార్యక్రమాలలో భాగంగా శనివారం సంచలనాత్మక కథ ‘థూ…’ పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సభకు కథా నవలా రచయిత డాక్టర్‌ వి.చంద్రశేఖరరావు అధ్యక్షత వహించారు. ‘థూ..’ పుస్తక ఆవిష్కరణను రచయిత పి.వి.సునీల్‌ కుమార్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ప్రముఖ సాహితీవేత్త సతీష్‌ చందర్‌ పాల్గొని మాట్లాడుతూ రాజ్యాలు, రాచరికాలు మారినా సమాజంలో దళితుల తల రాతలు మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా దళితులపై అగ్రకులాల దాడులు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్ధలో దళితులను కూడా అణగద్రొక్కుతున్నారని, వారిని ఒక మనిషిగా గుర్తించుటలేదని వాపోయారు. నేడు సమాజంలో దళితులపై అగ్రకులాల వారు ఏవిధంగా అణగద్రొక్కుతున్నారో వివరించడానికే సునీల్‌ కుమార్‌ రచించిన ‘థూ..’ కథ చక్కగా అర్ధం అవుతుందని పేర్కొన్నారు. ఒక గ్రామం నుంచి న్యాయ వ్యవస్ధ వరకు దళితులను చిన్న చూపు చూస్తుందని, ఇది మారితేనే సమాజం మారుతుందని అన్నారు. అగ్రకులాల దాడులు జరుగుతున్నంతకాలం ఉద్యమాలు పుట్టుకొస్తూనే ఉంటాయని తెలియజేశారు. ‘థూ..’లో చుండూరులోని యదార్ధ సంఘటనను కళ్ళకు కట్టినట్లు సునీల్‌ కుమార్‌ రచన ఉందని అభినందించారు. ‘థూ..’ రచయిత పి.వి.సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ ఒక వాస్తవ కథను రచించి, ప్రచురించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానన్నారు. విశాలాంధ్ర ప్రచురించడం హర్షణీయమన్నారు. సభ అధ్యక్షులు వి.చంద్రశేఖరరావు మాట్లాడుతూ మంచి కథ, కదనం, భావంతో రచించిన థూ… వంటి రచనలు సమాజంలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రచయితలు చెరుకూరి సత్యనారాయణ, చందోలు శశికుమార్‌, సంగం, అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు ఎ.ఎం.ఆర్‌.ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిద పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.

రాయలసీమ సాహిత్య జీవితమే నా సాహిత్యం

kondepudi satkaram

రాయలసీమ గ్రామీణ జీవితంలోని మంచితనాన్ని, కష్టాలను నా సాహిత్యంలో సృజించానని ప్రముఖ సాహతీవేత్త సన్నపురెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాయలసీమ మట్టి పరిమళాన్ని, జీవన దృశ్యాలను నా సాహిత్యంలో సృష్టించే ప్రయత్నం చేస్తున్నానని వెంకటరామిరెడ్డి అన్నారు. అరసం గుంటూరు జిల్లా శాఖ శనివారం రాత్రి పుస్తక మ¬త్సవ ప్రాంగణంలో జరిగిన కొండేపూడి శ్రీనివాసరావు 90వ జయంతి సభలో వెంకటరామిరెడ్డికి సాహితీ పురస్కారాన్ని అందజేశారు. ఈ సభకు అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. వెంకటరామిరెడ్డి ‘నా సాహిత్య నేపథ్యం’ అనే అంశంపై మాట్లాడుతూ తన సాహిత్య కృషిని వివరించారు. ఈ సభలో ప్రముఖ యువ సాహితీవేత్త మంచికంటి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ సన్నపరెడ్డి సాహిత్యం యువరచయితలకు సిలబస్‌ వంటిదన్నారు. సన్నపురెడ్డి సాహిత్యకృషిని అభినందించారు. ఈ సభలో కొండేపూడి జయంత్‌ పదివేల నూటపదహారు రూపాయల నగదు, జ్ఞాపిక, శాలువాతో సన్నపురెడ్డిని సత్కరించారు. అధ్య్షత వహించిన పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సన్నపరెడ్డి తన రచనలకు అనేక అవార్డులు, బహుమతులు అందుకున్నారని వివరిస్తూ కొండేపూడి సత్కారాన్ని అరసం అతని సాహిత్య కృషిని గౌరవిస్తూ అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వల్లూరు శివప్రసాద్‌, నూకా రాంప్రసాద్‌రెడ్డి, జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ రచయితలు పెరగడానికి, సాహిత్య ప్రక్రియల విస్తరణకు విమర్శ దోహదం చేస్తుంది

vidita avishkarana

ఉత్తమ రచయితలు పెరగటానికి, సాహిత్య ప్రక్రియల విస్తరణకు విమర్శ దోహదం చేస్తుందని ప్రముఖ సాహితీవేత్త చందు సుబ్బారావు అన్నారు. ఉత్తమ విమర్శకుడికి సాహిత్యంపట్ల, సమాజం పట్ల బాధ్యత ఉంటుందని, రచయిత పట్ల ప్రేమ ఉండాలని, అప్పుడే సాహిత్య విమర్శ యొక్క ప్రయోజనం నెరవేరుతుందన్నారు. గుంటూరు బుక్‌ ఫెస్టివల్‌ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ రచన ”విదిత” వ్యాస సంపుటిని ఆయన ఆవిష్కరించారు. సభకు అరసం జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ కనపర్తి స్వర్ణలత అధ్యక్షత వహించారు. చందు సుబ్బారావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఇంటర్నెట్‌వల్ల సమాచారం దొరకవచ్చు, తద్వారా ఉద్యోగులు తయారు కావచ్చు. కానీ విజ్ఞానం పెరగదని, మేధావులు తయారుకారని, పుస్తక పఠనం మాత్రమే సమాజాన్ని మార్చే శక్తినిస్తుందన్నారు. నిబద్ధత, సైద్ధాంతిక స్పష్టత గల పెనుగొండ 60 మంది రచనలను మూల్యాంకనం చేశాడని ప్రశంశించారు. అరసం కార్యదర్శి ఉప్పల అప్పలరాజు ప్రసంగిస్తూ, నాలుగు దశాబ్ధాల సాహితీ జీవితంలో వామపక్ష సాహిత్యోద్యమ ప్రభావాన్ని, రచయితలను, వాటి సారాంశాన్ని తన విమర్శ ద్వారా పాఠకులకు అందించిన పెనుగొండ అభినందనీయుడని అన్నారు. సభా నిర్వాహకులు వల్లూరు శివప్రసాద్‌ మాట్లాడుతూ అభ్యుదయ సాహిత్యోద్యమానికి గుంటూరును కేంద్రంగా తీర్చిదిద్దడంలో పెనుగొండ కృషి చేశారని, వ్యవసాయ కుటుంబం నుండి స్వయం కృషితో ఎదిగిన విమర్శకుడిగా ఎదిగారన్నారు. జిల్లా అరసం నుండి ఇరవైకి పైగా గ్రంథాలను వెలువరించామని, ఎన్నో ఉత్తమ సంకలనాలకు సంపాదకుడిగా పెనుగొండ కృషి ఇక ముందు కూడా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పెనుగొండ లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గోలి సీతారామయ్య, పెనుమాక నాగేశ్వరరావు, డాక్టర్‌ అజిత, భూసురుపల్లి వెంకటేశ్వర్లు, ఎం.వి.ఎస్‌.ప్రసాద్‌, అరసం జిల్లా ఉపాధ్యక్షులు ఎ.ఎం.ఆర్‌.ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

భాషా, భావం ఉన్న కథలు ఆచంట శారదాదేవి కథలు

achanta sarada devi

కథలలో చక్కని భాష, భావం ఉన్న కథలు ఆచంట శారదాదేవి కథలు అని రచయిత్రి గోటేటి లలితాశేఖర్‌ అన్నారు. స్ధానిక లాడ్జి సెంటరులోని ఎ.ఎల్‌. బి.ఇడి కళాశాల ఆవరణలో విశాలాంధ్ర బుక్‌ హౌస్‌ ఆధ్వర్యంలో 16వ గుంటూరు పుస్తక మ¬త్సవాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా సోమవారం విశాలాంధ్ర ప్రచురించిన ఆచంట శారదాదేవి కథలు పుస్తక ఆవిష్కణ జరిగింది. ఈ కార్యక్రమానికి కథ, నవలా రచయిత పెనుమాక నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఆచంట శారదాదేవి కథలు పుస్తక ఆవిష్కరణను ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ సి.హెచ్‌.సుశీల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిధులుగా రచయిత్రి గోటేటి లలితాశేఖర్‌ పాల్గొని మాట్లాడుతూ శారదాదేవి ప్రజల, చుట్టుప్రక్కల జరిగిన అంశాలను చక్కగా మంచి సాహిత్యంతో, భావంతో రచించారన్నారు. ముఖ్యంగా ఆడపిల్లల జీవితాలు, వారి సమస్యలపై రచనలు చేసిన మహాశక్తి శారదాదేవి అని కొనియాడారు. 1945లో ఆమె తొలి రచన అపశ్రుతులును రచించారన్నారు. ఆవిష్కరణ కర్త సుశీల మాట్లాడుతూ శారదాదేవి 77 సంవత్సరాల జీవిత కాలంలో 46 సంవత్సరాలు రచనలు చేశారని గుర్తు చేశారు. శారదాదేవి రచనలలోని కొన్ని కథలను వివరించారు.

*****

మంచి విషయం నలుగురికీ చెప్పండి !
Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someonePrint this page

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)