Monthly Archive:: November 2014

పెనుగొండకు మారుపేరు బహువచనం

. గతకాలపు చీకటి నీడల్లోంచి, వర్తమాన సంక్షోభంలోంచి, రేపటిలోకి ప్రయాణిస్తున్న అవిశ్రాంత పథికుడు పెనుగొండ లక్ష్మీనారాయణ. అరవై ఏళ్ళనాడు మొదలైన ఈ జీవన యానం ఎన్నో దిగుళ్ళను, ఎగుడు దిగుళ్ళను అధిగమించింది. ఏ మజిలీలోను ఆగని నడక అతనిది. వ్యధావశిష్టమై ఆరని ఉత్సాహం అతనిది. పెనుగొండకు మరో పేరు జీవనోత్సాహం. అతనెప్పుడూ దు:ఖాన్ని ప్రేమించలేదు. ధైర్యాన్ని ప్రేమించాడు. ఆరాటాల బాట పట్టలేదు. పోరాటాల పాట అందుకున్నాడు. కావ్యకర్తగా కన్న కార్యకర్తగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతాడతను. సాహిత్య తైలంతో

ఆబాలగోపాలానికి సరళవ్యావహారికంలో భాగవతం

. భగవంతునకు, భగవద్భక్తులకు గల సంబంధ బాంధవ్యాలను తెలియచేసేదే భాగవతం, భవబంధవిమోచనం భాగవతం. సులభ భక్తిమార్గం భాగవతం, ఆధ్యాత్మికం, ఆధిభౌతికం తత్వాల స్వరూప స్వభావాల కూడలి భాగవతం. నిరాకారమయిన భక్తికి సాకారమయిన కథాకథనం, భాగవతం. మహాభారత రచన చేసి, మనశ్శాంతి కరువై సరస్వతి నదీ తీరానకూర్చున్నవ్యాసునికి నారదుడు బోధించిన గాయత్రీ బీజాక్షర ముద్రితం భాగవతం. ఈ భగవతాన్ని సరళ వ్యావహారికంలో అందించారు. ప్రముఖ రచయిత జగన్నాథశర్మ. నవ్యవిక్లిలో సంవత్సరానికి పైగా వెలువడి, విశేషంగా పాఠకుల ఆదరణ పొందిన

విషయ దృక్పథ వైవిధ్యం గల దళిత కథలు

. దళిత సాహిత్య వాదం రూపొందాక వెలువడ్డ నా కథానికలు వేర్వేరు సంపుటాలలో నుంచి తీసి, ఈ సంకలనం రూపొందించాను. నా కథానికల్లో స్త్రీ, బహుజన, మానవతా వాద నేపథ్యాలతో చేసిన రచనలున్నాయి. ఈ సంపుటిలోని కథానికల్లోని వస్తువులు, ఇతివృత్తాలు గుంటూరుకూ, అనంతపురానికీ సంబంధించి ఉన్నాయి. కథానికలు చాలావరకు వ్యావహారిక భాషగానే ఉన్నప్పటికీ కొన్నింటిలో గుంటూరు ప్రాంతానికి చెందిన, మరికొన్నింటిలో అనంతపురం పరిసరాలకు సంబంధించిన మాండలికం ఉంది. ఈ కథానికల్నీ వ్రాసింది అనంతపురంలోనే! దళిత దృక్పథంతో ఉన్న

జీవన మార్గం బోధించిన బౌద్ధం

. ‘బుద్ధుడు యోగుల్లో చక్రవర్తిలాంటివాడు’ – ఆది శంకరాచార్య ‘దాస్య విమోచన గురించి, దు:ఖ నిరోధం గురించి, సమ సమాజాన్ని గురించి బోధించి, మూఢ నమ్మకాలకు తావులేకుండా, మనిషిని మానవతా విలువలవైపు నడిపించే బౌద్ధం అన్ని మతాలకంటే ఉన్నతమైనది.’ – కారల్‌ మార్క్స్‌ ‘ఈ భూమి మీద ఆచరణలో ఉన్న మతాలన్నింటిలోనూ, శాస్త్రీయ జ్ఞానానికి అనుగుణంగా తన బోదనలు చేసింది బౌద్ధమతమే. ఆధునిక, శాస్త్రీయ అవసరాలకు సరిపోయే మతం ఏదైనా ఉన్నదా అంటే అది బౌద్ధమతమే.’ –

చలిలో మంటలు

. ”కూర్చున్న వాడిని కూర్చున్నట్లే వుంటాను దేశం రంగు వెలుస్తూ వుంటుంది, చుట్టూ పరకాయించి చూస్తాను కొండలూ మట్టి నీళ్ళూ సమస్తమూ రంగుతగ్గుతూ వుంటాయి, నా లోలోపల కురస్తున్న దిగులువర్షాన్ని చేతులు చాచి తాకుతుంటాను” మాధవ్‌ రాసిన ఇరవైయేడు పంక్తుల ఈ పద్యం చదివిన తరువాత నేను భారంగా, దిగులుగా, సాలోచనగా, మౌనంగా వుండిపోయాను. మైనస్‌ అయిదు డిగ్రీల సెల్సియస్‌ చలిలో నాచుట్టూ యెవరో వంద డిగ్రీల మంటని రాజేసి, నన్ను మరగించి, కరిగించి వేస్తున్నట్టు, అయినా

ఉద్యమమే ఊపిరిగా…

. ఉద్యమమే ఊపిరిగా జీవిస్తున్న చెరుకుమల్లి సింగా అభ్యుదయ ధృక్పధంతో రాసిన 33 కవితల సంపుటి ”ఉద్యమమే ఊపిరిగా”. వామపక్ష ఉద్యమాల కదలికలను, వర్తమాన సామాజిక చలనాలను నమోదు చేసిన కవితల సంపుటి. తాను అభిమానించే, ప్రేమించే ప్రజలకోసం, వారి అభ్యున్నతి కోసం స్వప్నిస్తున్న కవిగా సింగా ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాడు. ఆకృతి చెదిరిపోతుంది కవితా సంపుటితో తెలుగు పాఠకలోకానికి పరిచితుడైన అభ్యుదయ రచయిత సింగా అరసం ద్వారా అందిస్తున్న మరొక మంచి పుస్తకమిది.  

విస్పష్టమైన హెచ్చరికే, ”థూ…”

కొన్ని చారిత్రక సందర్భాలలో కొన్ని గొప్ప రచనలు వెలువడతాయి. ఆ సందర్భం సంబంధిత చరిత్రను ప్రకాశవంతం చేసేది కావచ్చు. లేదా చీకటి కోణంగా నిలవేసేది కావచ్చు. దానికి ప్రతిస్పందనగానే రచన ఉంటుంది. అలాంటి చారిత్రక చీకటి కోణపు ఒక విభ్రాంతికరమైన సందర్భంలోంచి పుట్టుకొచ్చిన గొప్ప కథ, ”థూ…”. అగ్రవర్ణ అహంకారం, అభిజాత్యం చుండూరులో అత్యంత కిరాతక హింస రచన సృష్టించి 20 సంవత్సరాలయింది. కిందికోర్టు నేరాన్ని నిర్ధారించి నిందితులకు శిక్షలు విధించింది. పైకోర్టు అందుకు భిన్నమైన తీర్పును

ఒక జాతి రెండు రాష్ట్రాలు…

  అభ్యుదయ రచయతల సంఘం (అరసం) తెలుగు జాతి సాహిత్య సాంస్కృతిక వికాసానికి త్రికరణ శుద్ధిగా అంకితమై పనిచేస్తోంది. తెలుగు జాతి నేడు రెండు రాష్ట్రాలుగా రూపొందింది. రెండు రాష్ట్రాల్లోనూ పీడిత ప్రజల పక్షాన సాహిత్య సాంస్కృతిక సంపదను పరిరక్షించేందుకు కృషిచేస్తుంది. ప్రాంతీయ అస్థిత్వాలను అరసం గుర్తిస్తుంది. అదే సమయంలో అహంభావాన్ని తిరస్కరిస్తుంది. రెండు రాష్ట్రాల్లోని తెలుగువారి చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యాలతోపాటు అన్ని ప్రాంతీయ మాండలికాల అభివృద్ధికి అరసం నిరంతరం కృషిచేస్తుంది. పాఠ్య పుస్తకాల రూపకల్పన

తెరేష్‌ బాబుకు అరసం నివాళి

  దళిత ‘శర సంధాన’మై విజృంభించిన కవితాభిమన్యుడు పైడి తెరేష్‌ బాబు. కోట్లాది పీడిత జన ఘోష ‘అల్ప పీడన’మై ఆవరించి సాహితీ ప్రపంచాన్నీ అతలాకుతలం చేసిన వాడు. హిందూ మహాసముద్రం, నేను – నా వింతలమారి ప్రపంచం, కావడి కుండలు తదితర కవితా సంకలనాలను ప్రపంచంలో ప్రసరింపజేసి ఆకస్మికంగా అస్తమించిన దళిత కవి, గాయకుడు, రేడియో వ్యాఖ్యాతగా సుప్రసిద్ధుడు శ్రీ పైడి తెరేష్‌ బాబు మృతికి ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ప్రగాఢ సంతాపాన్ని

బాహ్య అంతర్గత రూపాలను ఆవిష్కరించిన ”ముఖచిత్రాలు”

శ్రీమతి బషీరున్సీసా బేగం రచించిన ”ముఖ చిత్రాలు” కవితా సంపుటిని ప్రముఖ సాహితీవేత్త శ్రీమతి చిల్లర భవానీదేవి ఆవిష్కరించారు. అక్టోబర్‌ 2వ తేదీన గుంటూరులోని జిల్లా గ్రంథాలయ సంస్ధ సమావేశ మందిరంలో జరిగిన సమావేశానికి గుంటూరు జిల్లా రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ పి.వి.సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భవానీదేవి మాట్లాడుతూ ప్రపంచమంతా కవితామయమే అయినా వస్తువును కవిత్వీకరించే నేర్పు కవికి అవసరమన్నారు. ”ముఖచిత్రాలు”లో కవియిత్రి బాహ్య, అంతర్గత సౌందర్యాన్ని స్పష్టంగా ఆవిష్కరించగలిగారని బషీరున్నీసా