కథ Archive

ప్రపంచం మాయమైపోయింది

అదేంటో ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఆమధ్య ఒకసారి పొద్దునపూట చూడటం మొదలుపెట్టా, మధ్యాహ్నం అమ్మ భోజనానికి కేక వేస్తేగాని తెలివిరాలేదు . ఆకలి గుర్తురాదు. అప్పుడప్పుడు నిద్రపోవడం కూడా మర్చిపోతుంటాను. హాల్లో అందరూ కూచుని సంతోషంగా టివి చూస్తుంటే, నేను పొద్దుగూకులు పడకగదిలో ఏం చేస్తుంటానా అని మా అమ్మకి చాలా సార్లు అనుమానం వచ్చింది. “ఏం చేస్తున్నావురా” అడిగేది “రాస్కుంటున్నాను మా” చెప్పేవాడిని “ఏం రాస్తావో ఏంటో ! ఎప్పుడు చూసినా ఆ కిటికీలోంచి బయటికి చూడటమే తప్ప

ఓ కథ రాసిపెట్టరూ…!

కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ   హలో…! హలో…!! నమస్కారమండీ! బాగున్నారా? బాగున్నా, మీరెవరూ? నేను ఘీంకారం అండి. ఘీంకారమా, అదేం పేరండీ! ఇంతకీ మీరెవరూ? నేనాండి, నేను శ్రీకారం పత్రిక ఎడిటర్నండి. శ్రీకారం పత్రిక….! ఈ పేరెప్పుడూ వినలేదే… అవునండీ కొత్తగా పెట్టారండీ. ఈ మధ్యనే. పత్రిక ఇంకా మార్కెట్లోకి రాలేదు లెండి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే…! అవునండి, పత్రిక కొత్తదే గాని ఈ గొంతు మాత్రం పాద్దేనండి, గతంలో మీరు విన్న గొంతేనండీ. మరి