ప్రవాహం Archive

ఆగని ప్రయాణం

అగ్నిజడిలో తడిసిన అలజడి జీవితం ఓ నిరంతర అంగారప్రవాహం చెదిరిన ఆకృతులను హత్తుకున్న అద్దం అదివరకంత ఆకర్షణగా అనిపించదు సుదూరాల గహన గమ్యాల మార్గం ఎన్నడూ తిన్నంగా కనిపించదు క్లిష్టాతిక్లిష్ట సంక్లిష్ట సంఘర్షణల ప్రయాణం ఒకడుగు ముందుకు – కొన్ని అడుగులు వెనక్కి?! విశ్రమించే తావు కానేకాదు, వేళ అసలేకాదు; ఈ పయనం ఆగేదీకాదు ఇష్టానిష్టాల పరిమితులకు లోబడని యానం అయినా….. … ఆగని ప్రయాణం కాలాన్ని కడుపులో నింపుకున్న కలం పురోగమనమే దాని తత్వం చిమ్మచీకట్లను,

తెలుగును మరవద్దు

”దేశ భాషలందు – తెలుగు లెస్స” నా తెలుగు భాష – కోటి రతనాల భాష తేనె కన్న తియ్యనైన భాష దేశ భాషలకే వేదంబైన భాష… మట్టిలో మాణిక్యమైన భాష…. . ”వెన్నకన్న వెన్నెలకన్న” అఖిలాండ సూర్యుని కన్న వెలుగైన భాష తేట తెల్లని భాష… అమ్మ ఉగ్గుపాల భాష నా తెలుగు భాష… కమ్మనైన ఆవుపాల భాష నా తెలుగు భాష సామ వేదంబుకన్న సరళమైన భాష విశ్వ భాషలలో అందమైన భాష…. .

శిశు రోదన

అమ్మా నన్ను పుట్టనివ్వమ్మా అమ్మా నన్ను బ్రతకనివ్వమ్మా . పైడి గిన్నెలో పాల బువ్వొద్దు వెండి గిన్నెలో వేడి బువ్వొద్దు చందమామను తెచ్చివ్వొద్దు అద్దంలో నను చూపించొద్దు పిడికెడు మెతుకులు పెట్టావంటే నా బుల్లి కడుపుకు చాలమ్మా ||అమ్మా|| . ఆడపిల్లనని భయ పడవద్దు కాళిక నేను అవుతానమ్మా ఆడపిల్లలను చంపవద్దని అందరినీ వారిస్తాను జనాల కళ్ళు తెరిపిస్తాను ఆడవాళ్ళకు న్యాయం చేస్తూ క్రొత్త చరిత్రను రాసేస్తాను! . మంచి విషయం నలుగురికీ చెప్పండి !

అభ్యుదయం

ఏవో, ఏవేవో, ఏవేవో ఘోషలు వినబడుతున్నాయ్! గుండెలు విడిపోతున్నాయ్!   ఎవరో, ఎవరెవరో, ఎవరెవరో తల విరబోసుకు నగ్నంగా నర్తిస్తున్నారు! భయో ద్విగ్నంగా వర్తిస్తున్నారు!   అవిగో! అవి గవిగో! అవి గవిగో! ఇంకిన, తెగిపోయిన, మరణించిన క్రొన్నెత్తురు! విపంచికలు! యువయోధులు!   నేడే, ఈనాడే!, ఈనాడే!- జగమంతా బలివితర్ది! నరజాతికి పరివర్తన! నవజీవన శుభసమయం! అభ్యుదయం! 02-04-1937 మంచి విషయం నలుగురికీ చెప్పండి !

ఉద్యమమే ఊపిరిగా…..

**** అతడు నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నాడు అన్ని దిక్కులూ అన్ని వేళలూ చరిత్ర అంతా అలుముకొని మండుతూనే ఉన్నాడు ఓ చైతన్య తపస్సు   కొండలూ, గుట్టలూ, అడవినీ, మనిషినీ అలుముకునే ఉన్నాడు సిగ్గులేని సమాజాన్ని ఎత్తిన పిడికిలి దించకుండా ప్రశ్నిస్తూనే ఉన్నాడు   జీవనయానంలో పొగలి పొగలి దు:ఖిస్తూనే అతుకు బతుకులకి నవజీవనవేదం ఎప్పుడని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాడు   ఈ దేశానికి శస్త్ర చికిత్స చేయాలని అనీలంబానీ, ముఖేష్‌ అంబానీ లాంటి పెట్టుబడిదారులు పనిచేయకుండానే