మన రచయిత Archive

పెద్దిభొట్ల సుబ్బరామయ్య

”గురజాడ, శ్రీ పాద, కొ.కు., గోపీచంద్‌, చాసో వంటి కథకుల కోవకు చెందిన పెద్దిభొట్ల జీవిత వాస్తవికతను-వాస్తవిక, అభ్యుదయ దృక్పథంతో విమర్శనాత్మకంగా విశ్లేషించి శిల్పాత్మకంగా రూపు కట్టించే సంప్రదాయానికి వారసుడు” మానవ జీవితంలోని విషాద దృశ్యాలను నాలుగున్నర దశాబ్దాలుగా కథలుగా, నవలలుగా చిత్రీకరిస్తున్న పెద్దిభొట్ల సుబ్బరామయ్య 1938 డిసెంబర్‌ 15వ తేదీన గుంటూరులో జన్మించారు. ఎం.ఏ వరకు చదివిన వీరు విజయవాడ ఆంధ్ర లయోల కళాశాల ఆంధ్రశాఖలో 1957 నుంచి నలభై ఏళ్ళపాటు అధ్యాపకునిగా పనిచేస్తూ ఆ

చాగంటి సోమయాజులు

చాసో (17-1-1915 నుండి 2-1-1994)   గురజాడ వారసత్వానికి వన్నె తెచ్చిన చాసో ఆయన పెన్నుమూసిన 1915లో కన్ను తెరిచారు. శ్రీకాకుళానికి చెందిన కానుకొలను నరహరిరావు దత్తతవలన విజయనగరపు చాగంటి సోమయాజులుగా మారి తరువాతి కాలంలో చాసోగా ప్రసిద్ధులయ్యారు. కాదంబరి అన్నపూర్ణ గారితో 13వ ఏట చాసోకి వివాహమయింది. 1948లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జమిందారీ, ఇనాందారీ రద్దు బిల్లులవలన చాసో ఆస్తులను కోల్పోయారు. 1957లో తన తల్లి పేరున తులసి ప్రెస్‌ను విజయనగరంలో పెట్టారు.   బి.ఎ.