శ్రీశ్రీ సాహిత్య నిధి పేరిట మహాకవి సాహిత్యాన్ని, ఆయనపై వచ్చిన వివిధ రచనలను వరసగా ప్రచురిస్తూ తెలుగు సాహిత్య లోకంలో విశిష్ట కృషి చేస్తున్న సింగంపల్లి అశోక్‌కుమార్‌ను అరసం అభినందిస్తోంది. డాక్టర్‌ కడియాల రామమోహన్‌రాయ్‌ ‘తెలుగు సాహిత్యంపై మహాకవి శ్రీశ్రీ ప్రభావం’ అనే శీర్షికతో ఎం.ఫిల్‌ సిద్ధాంత వ్యాసం రాశారు. దీన్ని రెండుగా విడగొట్టి ‘శ్రీశ్రీపై ముఖాముఖి’ (20వ ప్రచురణ), ‘తెలుగు సాహిత్యంపై మహాకవి శ్రీశ్రీ ప్రభావం’ (46వది) అని రెండు పుస్తకాలుగా సింగంపల్లి వెలువరించారు. ఆయన