సంపాదకీయం Archive

కేశవరెడ్డి మృతికి అరసం సంతాపం

  స్మశానం దున్నేరు, మునెమ్మ, చివరి గుడిసె, రాముండాది రాజ్జెముండాది వంటి నవలల్లో దళిత జీవిత దుర్భరత్వాన్ని, పాఠకులను చైతన్యవంతం చేసేలా, ఆలోచనలు రేకెత్తించేలా రచనలు సాగించిన నిబద్ధ రచయిత కేశవరెడ్డి. దళితవాదం లేని రోజుల్లో దళిత హక్కుల కోసం ఉద్యమస్థాయిలో వినిపించిన బలమైన గొంతు కేశవరెడ్డి ! మనవజీవితపు చీకటి కోణాలను, సంక్లిష్టతలను తనదైన శైలిలో చిత్రించిన గొప్ప నవలా రచయిత డాక్టర్ కేశవరెడ్డి మృతికి అభ్యుదయ రచయితల సంఘం (అరసం) సంతాపం తెలుపుతోంది.   –

కథానిక పాఠశాల (Workshop On Story)

ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ గుంటూరు నగరంలో డిసెంబర్‌ 26, 27, 28 తేదీలు శుక్ర, శని, ఆదివారాలలో కథానిక రచనపట్ల ఆసక్తి వున్న యువతీ, యువకుల్ని ఎంపికచేసి కథారచనలో శిక్షణ ఇవ్వడానికి పూనుకుంది. శిక్షణకు 20 – 35 సం||ల యువతీ, యువకులు అర్హులు. కథానిక రచనపట్ల ఆసక్తి వున్న యువతీ, యువకులు డిసెంబర్‌ 18లోగా తమ దరఖాస్తులను పంపాలి. బయోడేటాతోపాటు ఫోటో జతపరుస్తూ, గతంలో ఏవైనా రచనలు ప్రచురించబడినచో ఆయా

ఒక జాతి రెండు రాష్ట్రాలు…

  అభ్యుదయ రచయతల సంఘం (అరసం) తెలుగు జాతి సాహిత్య సాంస్కృతిక వికాసానికి త్రికరణ శుద్ధిగా అంకితమై పనిచేస్తోంది. తెలుగు జాతి నేడు రెండు రాష్ట్రాలుగా రూపొందింది. రెండు రాష్ట్రాల్లోనూ పీడిత ప్రజల పక్షాన సాహిత్య సాంస్కృతిక సంపదను పరిరక్షించేందుకు కృషిచేస్తుంది. ప్రాంతీయ అస్థిత్వాలను అరసం గుర్తిస్తుంది. అదే సమయంలో అహంభావాన్ని తిరస్కరిస్తుంది. రెండు రాష్ట్రాల్లోని తెలుగువారి చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యాలతోపాటు అన్ని ప్రాంతీయ మాండలికాల అభివృద్ధికి అరసం నిరంతరం కృషిచేస్తుంది. పాఠ్య పుస్తకాల రూపకల్పన

వరంగల్ డిక్లరేషన్

అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల (ఉమ్మడి) 17వ మహాసభలు 2014- సెప్టెంబర్‌ 27,28; వరంగల్‌.   చేయీచేయీ కలిపి ముందుకు సాగుదాం! ప్రగతిశీల సాహితీ, సాంస్కృతిక సంస్థలు, వ్యక్తులకు అరసం పిలుపు.   ప్రపంచ విముక్తి పోరాటాలు, జాతీయోద్యమం, సంఘసంస్కరణలు, సంఘర్షణల యుగంలో పుట్టింది అభ్యుదయ రచయితల సంఘం (అరసం). ఫాసిస్టు శక్తుల్ని ఎదిరించి, ప్రపంచ శాంతి కోసం ఉద్యమించింది అరసం. మార్క్సిజం తాత్విక పునాదిగా, సామ్యవాద వాస్తవికత దృక్పథంతో మొక్కవోని దీక్షతో

మీ ముందుకు మళ్ళీ ‘అభ్యుదయ’

మీ ముందుకు మళ్ళీ ‘అభ్యుదయ’ సమాజ ఉన్నతికి అభ్యుదయమెంతో అవసరం. అభ్యుదయం సామాజికాభ్యుదయాన్ని కాంక్షించే సకల జనావళికవసరం. అలాగే ఆ సమాజ చలన సూత్రాలను విశ్లేషించే, విమర్శించే సాహితీవేత్తలకు ‘అభ్యుదయ’ పత్రికా అంతే అవసరం. ‘అభ్యుదయ’ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అధికార పత్రిక. ఈ పత్రిక పుట్టుపూర్వోత్తరాలకెళితే శ్రీమతి రాచమళ్ళ సత్యవతీదేవి సంపాదకత్వాన వెలువడిన ‘తెలుగు తల్లి’ పత్రికను తొలనాళ్ళలో అరసం తన పత్రికగా వెలువరించింది. తరువాత అరసం నేత శ్రీ తుమ్మల వెంకటరామయ్య ప్రచురణకర్తగా