. ఉద్యమమే ఊపిరిగా జీవిస్తున్న చెరుకుమల్లి సింగా అభ్యుదయ ధృక్పధంతో రాసిన 33 కవితల సంపుటి ”ఉద్యమమే ఊపిరిగా”. వామపక్ష ఉద్యమాల కదలికలను, వర్తమాన సామాజిక చలనాలను నమోదు చేసిన కవితల సంపుటి. తాను అభిమానించే, ప్రేమించే ప్రజలకోసం, వారి అభ్యున్నతి కోసం స్వప్నిస్తున్న కవిగా సింగా ఈ పుస్తకంలో మనకు కనిపిస్తాడు. ఆకృతి చెదిరిపోతుంది కవితా సంపుటితో తెలుగు పాఠకలోకానికి పరిచితుడైన అభ్యుదయ రచయిత సింగా అరసం ద్వారా అందిస్తున్న మరొక మంచి పుస్తకమిది.