కథలు Archive

చాగంటి సోమయాజులు

చాసో (17-1-1915 నుండి 2-1-1994)   గురజాడ వారసత్వానికి వన్నె తెచ్చిన చాసో ఆయన పెన్నుమూసిన 1915లో కన్ను తెరిచారు. శ్రీకాకుళానికి చెందిన కానుకొలను నరహరిరావు దత్తతవలన విజయనగరపు చాగంటి సోమయాజులుగా మారి తరువాతి కాలంలో చాసోగా ప్రసిద్ధులయ్యారు. కాదంబరి అన్నపూర్ణ గారితో 13వ ఏట చాసోకి వివాహమయింది. 1948లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జమిందారీ, ఇనాందారీ రద్దు బిల్లులవలన చాసో ఆస్తులను కోల్పోయారు. 1957లో తన తల్లి పేరున తులసి ప్రెస్‌ను విజయనగరంలో పెట్టారు.   బి.ఎ.

ఓ కథ రాసిపెట్టరూ…!

కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ   హలో…! హలో…!! నమస్కారమండీ! బాగున్నారా? బాగున్నా, మీరెవరూ? నేను ఘీంకారం అండి. ఘీంకారమా, అదేం పేరండీ! ఇంతకీ మీరెవరూ? నేనాండి, నేను శ్రీకారం పత్రిక ఎడిటర్నండి. శ్రీకారం పత్రిక….! ఈ పేరెప్పుడూ వినలేదే… అవునండీ కొత్తగా పెట్టారండీ. ఈ మధ్యనే. పత్రిక ఇంకా మార్కెట్లోకి రాలేదు లెండి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే…! అవునండి, పత్రిక కొత్తదే గాని ఈ గొంతు మాత్రం పాద్దేనండి, గతంలో మీరు విన్న గొంతేనండీ. మరి