కవితలు Archive

శిశు రోదన

అమ్మా నన్ను పుట్టనివ్వమ్మా అమ్మా నన్ను బ్రతకనివ్వమ్మా . పైడి గిన్నెలో పాల బువ్వొద్దు వెండి గిన్నెలో వేడి బువ్వొద్దు చందమామను తెచ్చివ్వొద్దు అద్దంలో నను చూపించొద్దు పిడికెడు మెతుకులు పెట్టావంటే నా బుల్లి కడుపుకు చాలమ్మా ||అమ్మా|| . ఆడపిల్లనని భయ పడవద్దు కాళిక నేను అవుతానమ్మా ఆడపిల్లలను చంపవద్దని అందరినీ వారిస్తాను జనాల కళ్ళు తెరిపిస్తాను ఆడవాళ్ళకు న్యాయం చేస్తూ క్రొత్త చరిత్రను రాసేస్తాను! . మంచి విషయం నలుగురికీ చెప్పండి !

అభ్యుదయం

ఏవో, ఏవేవో, ఏవేవో ఘోషలు వినబడుతున్నాయ్! గుండెలు విడిపోతున్నాయ్!   ఎవరో, ఎవరెవరో, ఎవరెవరో తల విరబోసుకు నగ్నంగా నర్తిస్తున్నారు! భయో ద్విగ్నంగా వర్తిస్తున్నారు!   అవిగో! అవి గవిగో! అవి గవిగో! ఇంకిన, తెగిపోయిన, మరణించిన క్రొన్నెత్తురు! విపంచికలు! యువయోధులు!   నేడే, ఈనాడే!, ఈనాడే!- జగమంతా బలివితర్ది! నరజాతికి పరివర్తన! నవజీవన శుభసమయం! అభ్యుదయం! 02-04-1937 మంచి విషయం నలుగురికీ చెప్పండి !