అగ్నిజడిలో తడిసిన అలజడి జీవితం ఓ నిరంతర అంగారప్రవాహం చెదిరిన ఆకృతులను హత్తుకున్న అద్దం అదివరకంత ఆకర్షణగా అనిపించదు సుదూరాల గహన గమ్యాల మార్గం ఎన్నడూ తిన్నంగా కనిపించదు క్లిష్టాతిక్లిష్ట సంక్లిష్ట సంఘర్షణల ప్రయాణం ఒకడుగు ముందుకు – కొన్ని అడుగులు వెనక్కి?! విశ్రమించే తావు కానేకాదు, వేళ అసలేకాదు; ఈ పయనం ఆగేదీకాదు ఇష్టానిష్టాల పరిమితులకు లోబడని యానం అయినా….. … ఆగని ప్రయాణం కాలాన్ని కడుపులో నింపుకున్న కలం పురోగమనమే దాని తత్వం చిమ్మచీకట్లను,