కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ Archive

విస్పష్టమైన హెచ్చరికే, ”థూ…”

కొన్ని చారిత్రక సందర్భాలలో కొన్ని గొప్ప రచనలు వెలువడతాయి. ఆ సందర్భం సంబంధిత చరిత్రను ప్రకాశవంతం చేసేది కావచ్చు. లేదా చీకటి కోణంగా నిలవేసేది కావచ్చు. దానికి ప్రతిస్పందనగానే రచన ఉంటుంది. అలాంటి చారిత్రక చీకటి కోణపు ఒక విభ్రాంతికరమైన సందర్భంలోంచి పుట్టుకొచ్చిన గొప్ప కథ, ”థూ…”. అగ్రవర్ణ అహంకారం, అభిజాత్యం చుండూరులో అత్యంత కిరాతక హింస రచన సృష్టించి 20 సంవత్సరాలయింది. కిందికోర్టు నేరాన్ని నిర్ధారించి నిందితులకు శిక్షలు విధించింది. పైకోర్టు అందుకు భిన్నమైన తీర్పును

ఓ కథ రాసిపెట్టరూ…!

కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ   హలో…! హలో…!! నమస్కారమండీ! బాగున్నారా? బాగున్నా, మీరెవరూ? నేను ఘీంకారం అండి. ఘీంకారమా, అదేం పేరండీ! ఇంతకీ మీరెవరూ? నేనాండి, నేను శ్రీకారం పత్రిక ఎడిటర్నండి. శ్రీకారం పత్రిక….! ఈ పేరెప్పుడూ వినలేదే… అవునండీ కొత్తగా పెట్టారండీ. ఈ మధ్యనే. పత్రిక ఇంకా మార్కెట్లోకి రాలేదు లెండి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే…! అవునండి, పత్రిక కొత్తదే గాని ఈ గొంతు మాత్రం పాద్దేనండి, గతంలో మీరు విన్న గొంతేనండీ. మరి