కోసక్కు గ్రామం పొలిమేరల నుంచి ప్రారంభమవుతుంది మహారణ్యం. దట్టమైన చెట్లతో ఆ ప్రాంతమంతా చీకటిగా ఉంటుంది. పగటికీ, రాత్రికీ తేడా ఉండదు. ఒక సాయంత్రం డాన్‌ నది దాటటానికి సరంగు కోసం వెదికాను. ఆ రోజెందుకో పడవలెక్కువ లేవు. వర్షం కురిసి, నేలంతా చిత్తడిగా ఉంది. ఆకులు, చిన్న జంతువుల కళేబరాలు, కుళ్ళిన దుర్గంధం అతటా వ్యాపించింది. బురదలో కాలు తీసి కాలు వెయ్యటం కష్టంగా ఉంది. ఊరి చివరన, స్మశానంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. మరి