చాసో (17-1-1915 నుండి 2-1-1994)   గురజాడ వారసత్వానికి వన్నె తెచ్చిన చాసో ఆయన పెన్నుమూసిన 1915లో కన్ను తెరిచారు. శ్రీకాకుళానికి చెందిన కానుకొలను నరహరిరావు దత్తతవలన విజయనగరపు చాగంటి సోమయాజులుగా మారి తరువాతి కాలంలో చాసోగా ప్రసిద్ధులయ్యారు. కాదంబరి అన్నపూర్ణ గారితో 13వ ఏట చాసోకి వివాహమయింది. 1948లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జమిందారీ, ఇనాందారీ రద్దు బిల్లులవలన చాసో ఆస్తులను కోల్పోయారు. 1957లో తన తల్లి పేరున తులసి ప్రెస్‌ను విజయనగరంలో పెట్టారు.   బి.ఎ.