దళిత ‘శర సంధాన’మై విజృంభించిన కవితాభిమన్యుడు పైడి తెరేష్‌ బాబు. కోట్లాది పీడిత జన ఘోష ‘అల్ప పీడన’మై ఆవరించి సాహితీ ప్రపంచాన్నీ అతలాకుతలం చేసిన వాడు. హిందూ మహాసముద్రం, నేను – నా వింతలమారి ప్రపంచం, కావడి కుండలు తదితర కవితా సంకలనాలను ప్రపంచంలో ప్రసరింపజేసి ఆకస్మికంగా అస్తమించిన దళిత కవి, గాయకుడు, రేడియో వ్యాఖ్యాతగా సుప్రసిద్ధుడు శ్రీ పైడి తెరేష్‌ బాబు మృతికి ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ప్రగాఢ సంతాపాన్ని