శ్రీమతి బషీరున్సీసా బేగం రచించిన ”ముఖ చిత్రాలు” కవితా సంపుటిని ప్రముఖ సాహితీవేత్త శ్రీమతి చిల్లర భవానీదేవి ఆవిష్కరించారు. అక్టోబర్‌ 2వ తేదీన గుంటూరులోని జిల్లా గ్రంథాలయ సంస్ధ సమావేశ మందిరంలో జరిగిన సమావేశానికి గుంటూరు జిల్లా రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ పి.వి.సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భవానీదేవి మాట్లాడుతూ ప్రపంచమంతా కవితామయమే అయినా వస్తువును కవిత్వీకరించే నేర్పు కవికి అవసరమన్నారు. ”ముఖచిత్రాలు”లో కవియిత్రి బాహ్య, అంతర్గత సౌందర్యాన్ని స్పష్టంగా ఆవిష్కరించగలిగారని బషీరున్నీసా