పెనుగొండ లక్ష్మీనారాయణ Archive

పెనుగొండకు మారుపేరు బహువచనం

. గతకాలపు చీకటి నీడల్లోంచి, వర్తమాన సంక్షోభంలోంచి, రేపటిలోకి ప్రయాణిస్తున్న అవిశ్రాంత పథికుడు పెనుగొండ లక్ష్మీనారాయణ. అరవై ఏళ్ళనాడు మొదలైన ఈ జీవన యానం ఎన్నో దిగుళ్ళను, ఎగుడు దిగుళ్ళను అధిగమించింది. ఏ మజిలీలోను ఆగని నడక అతనిది. వ్యధావశిష్టమై ఆరని ఉత్సాహం అతనిది. పెనుగొండకు మరో పేరు జీవనోత్సాహం. అతనెప్పుడూ దు:ఖాన్ని ప్రేమించలేదు. ధైర్యాన్ని ప్రేమించాడు. ఆరాటాల బాట పట్టలేదు. పోరాటాల పాట అందుకున్నాడు. కావ్యకర్తగా కన్న కార్యకర్తగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతాడతను. సాహిత్య తైలంతో

రాయ్ గారూ.. ఇదేం పరిశోధన !?

శ్రీశ్రీ సాహిత్య నిధి పేరిట మహాకవి సాహిత్యాన్ని, ఆయనపై వచ్చిన వివిధ రచనలను వరసగా ప్రచురిస్తూ తెలుగు సాహిత్య లోకంలో విశిష్ట కృషి చేస్తున్న సింగంపల్లి అశోక్‌కుమార్‌ను అరసం అభినందిస్తోంది. డాక్టర్‌ కడియాల రామమోహన్‌రాయ్‌ ‘తెలుగు సాహిత్యంపై మహాకవి శ్రీశ్రీ ప్రభావం’ అనే శీర్షికతో ఎం.ఫిల్‌ సిద్ధాంత వ్యాసం రాశారు. దీన్ని రెండుగా విడగొట్టి ‘శ్రీశ్రీపై ముఖాముఖి’ (20వ ప్రచురణ), ‘తెలుగు సాహిత్యంపై మహాకవి శ్రీశ్రీ ప్రభావం’ (46వది) అని రెండు పుస్తకాలుగా సింగంపల్లి వెలువరించారు. ఆయన

మీ ముందుకు మళ్ళీ ‘అభ్యుదయ’

మీ ముందుకు మళ్ళీ ‘అభ్యుదయ’ సమాజ ఉన్నతికి అభ్యుదయమెంతో అవసరం. అభ్యుదయం సామాజికాభ్యుదయాన్ని కాంక్షించే సకల జనావళికవసరం. అలాగే ఆ సమాజ చలన సూత్రాలను విశ్లేషించే, విమర్శించే సాహితీవేత్తలకు ‘అభ్యుదయ’ పత్రికా అంతే అవసరం. ‘అభ్యుదయ’ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అధికార పత్రిక. ఈ పత్రిక పుట్టుపూర్వోత్తరాలకెళితే శ్రీమతి రాచమళ్ళ సత్యవతీదేవి సంపాదకత్వాన వెలువడిన ‘తెలుగు తల్లి’ పత్రికను తొలనాళ్ళలో అరసం తన పత్రికగా వెలువరించింది. తరువాత అరసం నేత శ్రీ తుమ్మల వెంకటరామయ్య ప్రచురణకర్తగా