సంపాదకీయం Archive

కేశవరెడ్డి మృతికి అరసం సంతాపం

  స్మశానం దున్నేరు, మునెమ్మ, చివరి గుడిసె, రాముండాది రాజ్జెముండాది వంటి నవలల్లో దళిత జీవిత దుర్భరత్వాన్ని, పాఠకులను చైతన్యవంతం చేసేలా, ఆలోచనలు రేకెత్తించేలా రచనలు సాగించిన నిబద్ధ రచయిత కేశవరెడ్డి. దళితవాదం లేని రోజుల్లో దళిత హక్కుల కోసం ఉద్యమస్థాయిలో వినిపించిన బలమైన గొంతు కేశవరెడ్డి ! మనవజీవితపు చీకటి కోణాలను, సంక్లిష్టతలను తనదైన శైలిలో చిత్రించిన గొప్ప నవలా రచయిత డాక్టర్ కేశవరెడ్డి మృతికి అభ్యుదయ రచయితల సంఘం (అరసం) సంతాపం తెలుపుతోంది.   –

ఒక జాతి రెండు రాష్ట్రాలు…

  అభ్యుదయ రచయతల సంఘం (అరసం) తెలుగు జాతి సాహిత్య సాంస్కృతిక వికాసానికి త్రికరణ శుద్ధిగా అంకితమై పనిచేస్తోంది. తెలుగు జాతి నేడు రెండు రాష్ట్రాలుగా రూపొందింది. రెండు రాష్ట్రాల్లోనూ పీడిత ప్రజల పక్షాన సాహిత్య సాంస్కృతిక సంపదను పరిరక్షించేందుకు కృషిచేస్తుంది. ప్రాంతీయ అస్థిత్వాలను అరసం గుర్తిస్తుంది. అదే సమయంలో అహంభావాన్ని తిరస్కరిస్తుంది. రెండు రాష్ట్రాల్లోని తెలుగువారి చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యాలతోపాటు అన్ని ప్రాంతీయ మాండలికాల అభివృద్ధికి అరసం నిరంతరం కృషిచేస్తుంది. పాఠ్య పుస్తకాల రూపకల్పన